Keerti Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Keerti Suresh turns producer for web series
షార్ట్స్‌లో చూడండి
*  చక్కని నటిగా పేరుతెచ్చుకుని తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా బిజీగా వున్న కీర్తి సురేశ్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారుతోంది. తమిళంలో ఓ వెబ్ సీరీస్ ను నిర్మించడానికి ఆమె ప్లాన్ చేసుకుంటోంది. అన్నట్టు, కీర్తి తండ్రి సురేశ్ కుమార్ కూడా నిర్మాత అన్న విషయం తెలిసిందే!
*  సాయితేజ్ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
*  నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లవ్ స్టోరీ' చిత్రం షూటింగ్ ఇప్పటికే ఎనభై శాతం వరకు పూర్తయింది. బ్యాలెన్స్ షూటింగును అక్టోబర్ ఒకటి నుంచి నిర్వహిస్తారు. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో గ్రామీణ వాతావరణం సెట్స్ వేస్తున్నారట.
Go Back to Shorts
Keerti Suresh
Sai Tej
Nabha Natesh
Naga Chaitanya
Sai Pallavi

More Telugu News