Balakrishna: కరోనా మహమ్మారిని మంత్రంతో తరిమికొడదామన్న బాలయ్య... వీడియో ఇదిగో!

Balakrishna explains a mantra to tackle corona pandemic
  • హిందూపురంలో బాలయ్య పర్యటన
  • హిందూపురం ఆసుపత్రికి ఉపకరణాల అందజేత
  • కరోనా మంత్రాన్ని పలికిన బాలయ్య
టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటించారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి రూ.55 లక్షల విలువైన వైద్య ఉపకరణాలు అందించారు. ఇంకా అనేక కార్యక్రమాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, కరోనా వైరస్ మహమ్మారిని పారదోలేందుకు, దీని పట్ల ప్రజల్లో ఉన్న భయం తొలగించేందుకు ఓ మంత్రం జపించాలని పిలుపునిచ్చారు. ఈ లలిత మహా త్రిపుర సుందరీ మంత్రాన్ని 108 సార్లు జపించాలని చెబుతూ, ఆ మంత్రాన్ని ఓసారి పలికారు. ఈ మంత్రం పఠించడం వల్ల కరోనా దరిచేరదని అన్నారు. ఒకవేళ తాను చెప్పిన మంత్రం మరీ పెద్దదిగా అనిపిస్తే దానికి షార్ట్ కట్ ను కూడా బాలయ్య సూచించారు. కరోనాను ఎదుర్కొనడానికి అన్ని అస్త్రాలు ఉపయోగించాలని స్పష్టం చేశారు.
Balakrishna
Mantra
Corona Virus
Hindupur

More Telugu News