Rana Daggubati: అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే కథతో రానా కొత్త సినిమా

Rana new film to be in the backdrop of Supe Natural powers
  • పెళ్లయ్యాక హిందీ చిత్రానికి ఓకే చెప్పిన రానా 
  • మిలింద్ రావ్ దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచరస్
  • 'విరాట పర్వం' తర్వాత సెట్స్ కి వెళ్లేలా ప్లానింగ్
ఇటీవలే తన ప్రేయసిని వివాహమాడి జీవితంలో సెటిల్ అయిన రానా దగ్గుబాటి తాజాగా ఓ హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో రానా కథానాయకుడుగా నటించనున్నాడు. మిలింద్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కించనున్నారు. ఇందులో వీఎఫ్ఎక్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, గోపీనాథ్ ఆచంట కలసి సంయుక్తంగా భారీ బడ్జెట్టుతో నిర్మిస్తారు.    

ఇదిలావుంచితే, రానా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న 'హాథీ మేరే సాథీ' చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. మరోపక్క, తెలుగులో సాయిపల్లవితో కలసి 'విరాట పర్వం' చిత్రంలో రానా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో మొదలవుతుంది. దీని తర్వాత మిలింద్ దర్శకత్వంలో రూపొందే చిత్రం చేస్తాడు.
Rana Daggubati
Milind Rau
Sai Pallavi

More Telugu News