Pawan Kalyan: పవర్ స్టార్ తో హరీశ్ శంకర్ మరోసారి... ఎల్లుండి ప్రకటన

Pawan Kalyan and Harish Shankar project will be announced on day after tomorrow
  • సెప్టెంబరు 2న సాయంత్రం 4.05 గంటలకు అనౌన్స్ మెంట్
  • ట్విట్టర్ లో వెల్లడించిన మైత్రీ మూవీ మేకర్స్
  • గతంలో ఇదే కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ ల కాంబినేషన్ లో మరో చిత్రం రానుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. దీనిపై సెప్టెంబరు 2న కీలక ప్రకటన వెలువడనుంది. ఎల్లుండి సాయంత్రం 4.05 గంటలకు పవన్ కొత్త చిత్రంపై అధికారిక ప్రకటన ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ లో వెల్లడించింది. పవన్, హరీశ్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీమేక్ చిత్రమే అయినా, పవన్ టాలెంట్ కు హరీశ్ మేకింగ్ తోడవడంతో నిజంగానే ట్రెండ్ సెట్ అయింది. ఇటీవలే గద్దలకొండ గణేశ్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హరీశ్ శంకర్... మరోసారి పవన్ తో మ్యాజిక్ చేయాలని తహతహలాడుతున్నాడు.
Pawan Kalyan
Harish Shankar
New Project
Mythri Movie Makers
Tollywood

More Telugu News