SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పూర్తి స్పృహలో ఉన్నారు: ఎంజీఎం ఆసుపత్రి వెల్లడి

MGM Hospital said SP Balasubrahmanyam is fully awake
  • బాలు ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఆసుపత్రి
  • వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని వెల్లడి
  • బాలు చికిత్సకు స్పందిస్తున్నారని బులెటిన్ లో వివరణ
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులు సంతోషపడేలా ఎంజీఎం ఆసుపత్రి తాజా బులెటిన్ వెలువరించింది. కరోనా కారణంగా తమ ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఆయనకు ఎక్మో సాయంతో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగిస్తున్నామని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు. ఇంకా ఐసీయూలోనే ఉన్న ఆయన ఇప్పుడు పూర్తి స్పృహలో ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. తమ ఆసుపత్రిలోని భిన్న విభాగాలకు చెందిన నిపుణులతో కూడిన వైద్యబృందం ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు.
SP Balasubrahmanyam
MGM Hospital
Bulletin
Corona Virus
ICU
ECMO
Ventilator

More Telugu News