Pranab Mukherjee: భారత్ దుఃఖిస్తోంది... ప్రణబ్ ముఖర్జీ కన్నుమూతపై ప్రధాని మోదీ స్పందన

PM Modi condolences the demise of former president of India Pranab Mukherjee
  • మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం
  • అత్యున్నత రాజనీతిజ్ఞుడు అంటూ కీర్తించిన మోదీ
  • అందరినీ మెప్పించారంటూ కితాబు
కాంగ్రెస్ వాది, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అస్తమయంతో భారత్ క్షోభిస్తోందని పేర్కొన్నారు. దేశ అభివృద్థి పథంలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. సమున్నత ఎత్తులకు ఎదిగిన రాజనీతి కోవిదుడు, పండితుడు అంటూ కీర్తించారు. రాజకీయ చిత్రపటంలో అన్ని వర్గాల వారిని మెప్పించి, సమాజంలో అందరి మన్ననలకు పాత్రుడయ్యారంటూ మోదీ ట్వీట్ చేశారు. 2014లో ఢిల్లీ వచ్చినప్పుడు తనకు ప్రణబ్ మార్గదర్శనం చేశారని వివరించారు. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రణబ్ దీవించిన సందర్భాన్ని మోదీ గుర్తుచేసుకున్నారు. 
Pranab Mukherjee
Narendra Modi
Demise
Former President Of India

More Telugu News