Akshay Kumar: బేర్ గ్రిల్స్ ఏనుగు విసర్జితాలతో చేసిన టీ తాగించాడు: అక్షయ్ కుమార్

Akshay Kumar revealed that Bear Grylls surprised him with elephant poop tea
  • అక్షయ్ కుమార్ తో స్పెషల్ ఎపిసోడ్ చేసిన బేర్ గ్రిల్స్
  • సెప్టెంబరు 14న డిస్కవరీ చానల్లో ప్రసారం
  • టీజర్ రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్
బ్రిటన్ మాజీ సైనికుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సర్వైవల్ అడ్వెంచరిస్టు బేర్ గ్రిల్స్ తో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చేసిన 'ఇంటూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్' కార్యక్రమంలో సెప్టెంబరులో ప్రసారం కానుంది. ఇప్పటికే భారీ హైప్ సంపాదించుకున్న ఈ ఎపిసోడ్ డిస్కవరీ ఇండియా చానల్లో సెప్టెంబరు 14న ప్రసారం కానుంది. అంతకుముందే సెప్టెంబరు 11న డిస్కవరీ ప్లస్ ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఇక ఈ కార్యక్రమంపై అక్షయ్ కుమార్ ఆసక్తికర సమాచారం పంచుకున్నారు. బేర్ గ్రిల్స్ తో 'ఇంటూ ద వైల్డ్...' కార్యక్రమం అనగానే ఎన్నో కఠినమైన సవాళ్ల గురించి ఊహించుకున్నానని, కానీ బేర్ గ్రిల్స్ తనను పూర్తిగా విస్మయానికి గురిచేశాడని, ఊహించని రీతిలో ఏనుగు మలంతో చేసిన టీ తాగించాడని తెలిపారు. ఏమైనా బేర్ తో ఎపిసోడ్ అద్భుతంగా సాగిందని వివరించారు.

అక్షయ్ ఈ కార్యక్రమానికి సంబంధించి చిన్న టీజర్ కూడా పోస్టు చేశారు. ఆ టీజర్ లో బేర్ గ్రిల్స్ తన కొంటెతనాన్ని చూపించాడు. అక్షయ్ కుమార్ ఏనుగు విసర్జితాలతో చేసిన టీ తాగుతుండగా, తాను మాత్రం తప్పించుకున్నాడు. "అక్షయ్ కుమార్... అటు చూడండి" అంటూ అక్షయ్ అటు తిరగ్గానే తన మగ్గులో ఉన్న ద్రవాన్ని పారబోశాడు. అక్షయ్ కుమార్ తో బేర్ అనేక స్టంట్లు కూడా చేయించినట్టు ఈ టీజర్ చెబుతోంది.

Akshay Kumar
Bear Grylls
Into The Wild With Bear Grylls
Discovery
Adventure

More Telugu News