NASA: 2,400 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్ నోవా బ్లాస్ట్... హబుల్ తీసిన స్టన్నింగ్ ఇమేజ్!

  • సూర్యునికన్నా 20 రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రం
  • నశించే దశలో పేలిపోయిన వైనం
  • దాదాపు 20 వేల ఏళ్ల క్రితం పేలుడు
Nasa Releases Supernova Blast Image

అంతరిక్షంలో సుదూరంగా సంభవించిన ఓ పరిణామాన్ని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది. సూర్యుని కన్నా దాదాపు 20 రెట్ల అధిక పరిమాణంలో ఉన్న ఓ నక్షత్రం నశించిపోతున్న వేళ, ఆ సూపర్ నోవా బ్లాస్ట్ సంభవించగా, హుబుల్ ఈ చిత్రాన్ని బంధించింది. నాసా ఈ బ్లాస్ట్ చిత్రాన్ని విడుదల చేసింది. మానవ చరిత్రలో ఇంతటి భారీ పేలుడు కనిపించడం ఇదే తొలిసారని, భూమికి 2,400 కాంతి సంవత్సరాల దూరంలో ఇది జరిగిందని నాసా వెల్లడించింది.

సూపర్ నోవాలను (పేలుతున్న నక్షతాలు) గమనించేందుకు వివిధ రకాల హై ఎండ్ టెలిస్కోప్ లను వినియోగిస్తున్నామని, వాటిల్లో ఒకటి ఈ దృశ్యాన్ని చిత్రీకరించిందని నాసా సైంటిస్టులు వివరించారు. అంతరిక్షం, సూపర్ నోవాలపై అధ్యయనంలో ఈ చిత్రం ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఇక ఈ సూపర్ నోవా బ్లాస్ట్ పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేసుకున్న నాసా, ఈ పేలుడు తరువాత కాంతిపుంజాలు ఎంతో దూరం ప్రసరించాయని పేర్కొంది. ఆకాశాన్నంతా కప్పేసేలా విస్తరించిందని వెల్లడించింది.

ఈ పేలుడు 10 వేల నుంచి 20 వేల ఏళ్ల క్రితం జరిగి ఉండవచ్చని, దీని కాంతి 60 కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించిందని అంచనా వేస్తున్నారు. సెకనుకు 220 మైళ్ల వేగంతో సూపర్ నోవా విస్తరించిందని నాసా పేర్కొంది. కాగా, ఇటీవల పాలపుంతకు అత్యంత సమీపంలోని ఆండ్రోమెడా గెలాక్సీలో భారీ ఎత్తున వాయు ప్రవాహాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. 

More Telugu News