Mahesh Babu: ‘సరిలేరు నీకెవ్వరు’లోని పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన మహేశ్ కూతురు సితార.. వీడియో వైరల్‌

sitara dances on  her father mahesh babu movie
  • ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మైండ్ బ్లాక్‌కి డ్యాన్స్‌
  • మరోసారి మహేశ్ అభిమానుల దృష్టిని ఆకర్షించిన సితార
  • గతంలోనూ త‌న తండ్రి సినిమాల్లోని పాటలకు డ్యాన్స్‌
మహేశ్ బాబు కూతురు సితార  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని మైండ్ బ్లాక్‌కి డ్యాన్స్‌ చేసి మరోసారి మహేశ్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. గతంలోనూ ఆమె త‌న తండ్రి సినిమాల్లోని పాటలకు ఇలా డ్యాన్స్‌ చేసి అలరించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆమె   చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు సరసన రష్మిక నటించింది. విజయశాంతి కీలక పాత్రలో నటించి అలరించింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు హిట్ అయ్యాయి.

సామాజిక మాధ్యమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సితార కొన్ని నెలల క్రితం 'డ్యాంగ్ డ్యాంగ్' పాటకు అదరగొట్టే స్టెప్పులు వేసి అలరించింది. తాజాగా అదే సినిమాలోని పాటకు ఇలా డ్యాన్స్ చేసింది.  

   
Mahesh Babu
sitara
Tollywood
Viral Videos

More Telugu News