Kanakadurga Flyover: విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా మెరిసిపోతున్న కనకదుర్గ ఫ్లైఓవర్

  • నిర్మాణం పూర్తయిన కనకదుర్గ ఫ్లైఓవర్
  • సెప్టెంబరు 4న ప్రారంభోత్సవం
  • సోషల్ మీడియాలో నైట్ విజన్ వీడియో సందడి
Night vision drone view of Kanakadurga Flyover in Vijayawada

విజయవాడ వాసులు ఎన్నాళ్ల నుంచో కోరుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ఇన్నాళ్లకు సాకారమైంది. సెప్టెంబరు 4న ఈ భారీ ఫ్లైఓవర్ ను సీఎం జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన డ్రోన్ వ్యూ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా, రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగులో కాంతులీనుతున్న కనకదుర్గ ఫ్లైఓవర్ కు సంబంధించిన ఫుటేజి ఆన్ లైన్ లో సందడి చేస్తోంది. ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియా విభాగం ట్విట్టర్ లో పంచుకుంది.


More Telugu News