భూమన ఆరోగ్య పరిస్థితిని ఫోన్ లో అడిగి తెలుసుకున్న సీఎం జగన్

CM Jagan asks about Bhumana health condition
  • కరోనా బారినపడిన భూమన కరుణాకర్ రెడ్డి
  • తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స
  • సీఎం జగన్ ఫోన్ తో భూమన సంతోషం
వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోనా బారినపడి ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. ఆయనకు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యే భూమన ఆరోగ్య పరిస్థితిని ఫోన్ లో అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం తన ఆరోగ్యంపై స్పందించడం పట్ల భూమన సంతోషం వ్యక్తం చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని సీఎం జగన్ కు తెలిపారు.
Go Back to Shorts
Jagan
Bhumana Karunakar Reddy
Corona Virus
Phone
YSRCP
Andhra Pradesh

More Telugu News