Avinash Reddy: కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి కరోనా పాజిటివ్

Kadapa MP Avinash Reddy tested corona positive
  • సెప్టెంబరు మొదటివారంలో కడప జిల్లాలో సీఎం పర్యటన
  • ప్రజాప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు
  • పాజిటివ్ రావడంతో హోంఐసోలేషన్ కు వెళ్లిన అవినాశ్ రెడ్డి
వైసీపీ ప్రజాప్రతినిధుల్లో కరోనా బారినపడిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బాధితుల జాబితాలో చేరారు. తాజాగా, కడప యువ ఎంపీ అవినాశ్ రెడ్డికి కూడా కరోనా వైరస్ సోకింది. వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ సెప్టెంబరు మొదటివారంలో కడప జిల్లా రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనలో పాల్గొనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నేతలు, మీడియా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఎంపీ అవినాశ్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. దాంతో ఆయన హోంఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇటీవల ఆయనను కలిసినవారు తమకు కూడా కరోనా సోకుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Avinash Reddy
Corona Virus
Positive
MP
Kadapa
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News