Disha Patani: టైమ్స్‌ మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్‌ జాబితాలో టాప్‌-10లో నిలిచిన హీరోయిన్లు వీరే!

  • దిశా ప‌టానీకి అగ్రస్థానం
  • రెండో స్థానంలో సుమన్ రావ్
  • మూడో స్థానంలో కత్రినా కైఫ్
Disha Patani tops The Times 50 Most Desirable Women 2019 list

టైమ్స్ వెల్లడించిన టాప్-50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితా-2019లో హీరోయిన్ దిశా ప‌టానీ అగ్రస్థానంలో నిలిచింది. గ‌త ఏడాది ఈ భామ ఇదే జాబితాలో 9వ ర్యాంక్‌లో ఉండగా, ఈ సారి ఏకంగా మొదటి స్థానానికి చేరడం విశేషం.

ఇదే జాబితాలో రెండో స్థానంలో సుమన్ రావ్, మూడో స్థానంలో కత్రినా కైఫ్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దీపికా పదుకునె, వర్తికా సింగ్, కైరా అద్వానీ, శ్రద్ధా కపూర్,  యామీ గౌతమ్, అదితీ రావు హైదరీ , జాక్వెలిన్ ఫెర్నాండెజ్  ఉన్నారు. దక్షిణ భారత హీరోయిన్లకు ఇందులో చోటు లభించలేదు.

కాగా, ఇటీవలే టైమ్స్‌ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా విడుదల చేయగా అందులో షాహిద్ కపూర్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో రణవీర్ సింగ్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నిలిచారు.

               

More Telugu News