New Delhi: రైలులో రూ. 43 కోట్ల బంగారం... పట్టేసిన ఢిల్లీ పోలీసులు!

43 Crores Worth Gold Seased by Delhi Police
  • మయన్మార్ నుంచి బంగారం తెచ్చిన నిందితులు
  • మయన్మార్ నుంచి 504 బిస్కెట్లు
  • 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఒకటి, రెండు కాదు... ఏకంగా రూ. 43 కోట్ల విలువైన బంగారాన్ని విదేశాల నుంచి అక్రమంగా దేశంలోకి తెచ్చి, దాన్ని దర్జాగా రైలులో గమ్యానికి తరలిస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, మయన్మార్ నుంచి తీసుకుని వచ్చారని భావిస్తున్న 504 బంగారం బిస్కెట్లను నిందితులు రైలులో ఢిల్లీకి తీసుకుని వచ్చారు. మొత్తం 504 బంగారం బిస్కెట్లను వీరుతెచ్చారు. ఇవన్నీ 99.9 శాతం స్వచ్ఛతను కలిగివున్నవే కావడం గమనార్హం. వీటి విలువ దాదాపు రూ. 43 కోట్లని డీఆర్ఐ (డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నామని తెలియజేశారు.
New Delhi
Gold
Smugling

More Telugu News