Sabitha Indra Reddy: సెప్టెంబర్ 1 నుంచి విద్యార్థులకు డిజిటల్ క్లాసులు: తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Digital classes starts in Telangana from September 1
  • రోజుకు మూడు గంటలు మాత్రమే క్లాసులు
  • ఒక్కో క్లాసు అరగంట నుంచి 45 నిమిషాలు
  • విద్యార్థుల కోసం తల్లిదండ్రులు సమయం కేటాయించాలి
తెలంగాణలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులకు డిజిటల్ క్లాసులను ప్రారంభించనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై సర్వే చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

 ఇంట్లో టీవీలు లేని విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించామని చెప్పారు. స్టూడెంట్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ ను తయారు చేసినట్టు తెలిపారు. రోజుకు మూడు గంటల పాటు మాత్రమే డిజిటల్ క్లాసులు ఉండాలని ఆదేశించారు. విద్యార్థుల కళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ఒక్కో క్లాసు అరగంట నుంచి 45 నిమిషాల పాటు మాత్రమే ఉండాలని చెప్పింది.

కరోనా కారణంగా విద్యార్థులు చదువు విషయంలో నష్టపోకూడదనే డిజిటల్ తరగతులను నిర్వహించబోతున్నట్టు సబిత తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ... నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయని అన్నారు.
Sabitha Indra Reddy
TRS
Digital Classes

More Telugu News