Nagarjuna: ఐదున్నర నెలల తర్వాత మళ్లీ వర్క్ చేయబోతున్నాను: నాగార్జున

Nagarjuna says that he will attend shooting after five and half months
  • బిగ్ బాస్-4 షూటింగ్ లో పాల్గొంటున్న నాగ్
  • వీడియో ద్వారా వెల్లడి
  • బర్త్ డే విషెస్ తెలిపినవారికి కృతజ్ఞతలు
టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా ఓ వీడియో సందేశం వెలువరించారు.

ఆ వీడియోలో నాగ్ మాట్లాడుతూ, నిన్నటి నుంచి తనకు ఎంతోమంది ప్రేమ, అభిమానాలతో కూడిన సందేశాలు పంపుతున్నారని, తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. మరో విషయం కూడా తనను ఆనందానికి గురిచేస్తోందని, ఐదున్నర నెలల తర్వాత మళ్లీ వర్క్ చేయబోతున్నానని వెల్లడించారు.

"బిగ్ బాస్ సీజన్-4 షూటింగ్ లో పాల్గొనబోతున్నాను. గతేడాది బిగ్ బాస్-3తో మీ ముందుకు వచ్చాను. ఆ సీజన్ లో నన్ను ఎంతగానో ఆదరించి, ఆ షోను సక్సెస్ చేశారు. అందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు సీజన్-4ని కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను" అంటూ నాగ్ పేర్కొన్నారు.
Nagarjuna
Shooting
Bigg Boss-4
Birthday
Tollywood

More Telugu News