2017 నుంచి గర్భవతిగానే ఉన్నాను: సమంత కొంటె సమాధానం

29-08-2020 Sat 14:52
  • ఆన్ లైన్ ద్వారా అభిమానులతో మాట్లాడిన సమంత
  • మీరు గర్భవతా? అని ప్రశ్నించిన ఓ అభిమాని
  • తన చేతిపై టాటూ ప్రత్యేకమన్న శామ్
Samanthas jovial answer to a fans question
తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ఆన్ లైన్ చాటింగ్ చేస్తూ... పలు ప్రశ్నలకు సమంత తనదైన శైలిలో సమాధానాలిచ్చింది. మీరు గర్భవతా? అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా...  2017 నుంచే తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానని, అయితే బయటకు రావడానికి బేబీ ఇష్టపడటం లేదని కొంటెగా సమాధానమిచ్చింది. తన చేతిపై ఉండే టాటూ గురించి చెపుతూ, అది తనకు, తన భర్త నాగ చైతన్యకు చాలా ప్రత్యేకమైనదని చెప్పింది. మరోవైపు సమంత 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.