Nutan Naidu: శిరోముండనం కేసులో ఏ1గా నూతన్ నాయుడు భార్య మధుప్రియ

Police filed case against Bigg Boss fame Nutan Naidu family members in tonsure issue
  • నూతన్ నాయుడు ఇంట్లో శిరోముండనం కలకలం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీకాంత్ అనే యువకుడు
  • పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పెందుర్తి పోలీసులు
బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు నివాసంలో శ్రీకాంత్ అనే ఎస్సీ యువకుడికి శిరోముండనం చేసిన ఘటనలో పెందుర్తి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 నిందితురాలిగా నూతన్ నాయుడు భార్య మధుప్రియ పేరు నమోదైంది.

మధుప్రియ ఇంటి పనిమనుషులు రవి, ఇందిర, ఝాన్సీ, వరహాలు, బాలు, సౌజన్యల పైనా కేసు నమోదు చేశారు. దీనిపై విశాఖ సీపీ మాట్లాడుతూ, శిరోముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. నూతన్ నాయుడు కుటుంబ సభ్యులు ఐఫోన్ చోరీకి గురైందని కొందరు పనివాళ్లను ప్రశ్నించారని, బాధితుడిని కర్రలు, రాడ్లతో కొట్టినట్టు వీడియోలో ఉందని వివరించారు.

Nutan Naidu
Madhu Priya
Tonsure
Srikanth
Police
Pendurthi
Vizag

More Telugu News