కేకేను బోల్తాకొట్టించిన కేటుగాడే ఎంపీ అరవింద్ కు సైతం టోకరా!

29-08-2020 Sat 14:37
  • కేంద్ర పథకం పేరిట వంచన
  • నిజమని నమ్మి పలువురిని ప్రోత్సహించిన ఎంపీ కేకే
  • అదే తరహాలో ఎంపీ అరవింద్ కూడా బోల్తాపడిన వైనం
Fraudster who cheats MP KK also duped MP Arvind
కేంద్ర ప్రభుత్వం పథకం పేరిట లక్షలు వస్తాయంటూ నమ్మించి ఎంపీ కేకేను సైతం బోల్తాకొట్టించిన మోసగాడు మరో ఎంపీ అరవింద్ కు కూడా టోకరా వేసినట్టు తెలిసింది. మోసగాడు మంత్రి కేటీఆర్ పేరు చెప్పడంతో కేకే ఎలాగైతే నమ్మారో, అరవింద్ కూడా అలాగే బోల్తాపడినట్టు వెల్లడైంది.

లక్షలు వచ్చే కేంద్ర పథకం, పైగా ఆ మోసగాడు కేటీఆర్ పేరు చెప్పడంతో తన పీఏ సాయంతో కొందరి నుంచి డబ్బులు వసూలు చేయించగా, ఆ తర్వాత అది మోసం అని తెలియడంతో ఎవరి డబ్బులు వారికి చెల్లించేసినట్టు సమాచారం. అయితే, ఈ ఘటనపై ఎంపీ అరవింద్ పోలీసుల వరకు వెళ్లలేదు. నిరుద్యోగులకు రుణాలు ఇస్తున్నామని, రూ.25 లక్షల వరకు రుణాలు ఇస్తామని, అందులో ఫిఫ్టీ పర్సెంట్ కేంద్రం సబ్సిడీ ఉంటుందని నమ్మబలికి కేకేను మోసగాడు బుట్టలో వేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో మహేశ్, సంజీవ్ అనే యువకులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.