Rhea Chakraborty: రియాకు రక్షణ కల్పించాలంటూ ముంబై పోలీసులకు సీబీఐ లేఖ

CBI writes letter to Mumbai Police seeking security for Rhea Chakraborty
  • రియా ఇంటి వద్ద మీడియా మోహరించింది
  • ఇంట్లోకి వెళ్లేందుకు కూడా యత్నిస్తున్నారని సీబీఐ లేఖ
  • రక్షణ కల్పిస్తామన్న ముంబై పోలీసులు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియాచక్రవర్తిని సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు రెండో రోజు ఆమె విచారణ కొనసాగుతోంది. మరోవైపు రియాకు, ఆమె కుటుంబానికి ముప్పు ఉందని, వారికి రక్షణ కల్పించాలని ముంబై పోలీసులకు సీబీఐ లేఖ రాసింది. ఆమె నివాసం వద్ద పెద్ద సంఖ్యలో మీడియా ఉంటోందని, ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు కూడా మీడియా వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొంది. దీనిపై ముంబై పోలీసులు స్పందిస్తూ రక్షణ కల్పిస్తామని చెప్పారు.
Rhea Chakraborty
CBI
Mumbai Police
Security

More Telugu News