Tabu: తిరిగి తిరిగి ఆ పాత్ర చివరికి టబు వద్దకే వచ్చిందట!

And thus Tabu is contacted again for Anda Dhun telugu remake
  • నితిన్ తో తెలుగులో 'అందాధున్' రీమేక్
  • హిందీలో కీలక పాత్ర పోషించిన టబు
  • ప్రచారంలో శ్రియ, ఇలియానా నయనతారల పేర్లు
  • చివరికి మళ్లీ టబునే సంప్రదిస్తున్న యూనిట్       
ఒక్కోసారి అలాగే జరుగుతుంది. మొదట్లో ఒక పాత్రకి ఒకళ్లని అనుకున్నాక.. మళ్లీ వేరే వాళ్లని అనుకోవడం .. అది కుదరక తిరిగి మొదట అనుకున్న వాళ్లనే ఫిక్స్ చేసుకోవడం సినిమాలలో మనం అప్పుడప్పుడూ చూస్తూనే వుంటాం. తాజాగా ప్రముఖ నటి టబు విషయంలో కూడా అలాగే జరిగింది. హిందీలో హిట్టయిన 'అందాధున్' చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. దీనికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రం హిందీ వెర్షన్ లో టబు ఓ కీలక పాత్ర పోషించింది. తెలుగులో కూడా ఆ పాత్రను ఆమెతోనే చేయించాలని మొదట్లో అనుకున్నారు. అయితే, ఎందుకో అది కుదరలేదు. ఆ తర్వాత ఆ పాత్రకు శియాను అనుకున్నారు.. తర్వాత ఇలియానా పేరు వచ్చింది. తర్వాత ప్రియమణి.. ఆ తర్వాత నయనతారను అనుకున్నారు.

ఇక నయనతార ఎంపిక పూర్తయిపోయిందని ప్రచారం కూడా జరిగింది. అయితే, ఆమె పారితోషికం ఎక్కువ అడగడంతో చివరికి ఓకే కాలేదట. ఆఖరికి ఇప్పుడు తిరిగి మళ్లీ టబుతోనే చిత్రం యూనిట్ సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. పైగా, ఆమె ఆ పాత్ర ఇప్పటికే హిందీలో చేసి వుండడం వల్ల ఆమె బాగా సరిపోతుందని కూడా భావిస్తున్నారు.  
Tabu
Shriya
Ileana
Nayanatara

More Telugu News