Krishnamraju: చేపల పులుసు వండిన కృష్ణంరాజు.. వీడియో!

Krishnamraju prepares Chepala Pulusu
  • వీడియో పోస్ట్ చేసిన కృష్ణంరాజు కుమార్తె
  • చేపుల పులుసు చేయడంలో నాన్నను మించినవారు లేరని కితాబు
  • మంచి ఎక్స్ పర్ట్ అని ప్రశంస
వాస్తవానికి సినీ ప్రముఖులకు ఒక్క క్షణం కూడా తీరిక ఉండదనే విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా వారు ఇంటిపట్టునే ఉంటూ... వారి సరదాలు తీర్చుకుంటున్నారు. ఇంటి పనులు చేయడం, వంటగదిలోకి వెళ్లి గరిటతిప్పడం వంటి పనులు చేస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా అద్భుతమైన చేపల పుసులు వంటకాన్ని తయారు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కుమార్తె ప్రసీద ట్విట్టర్ లో షేర్ చేశారు. చేపల పులుసు చేయడంతో తన తండ్రిని మించినవారు ఈ ప్రపంచంలోనే లేరని ఆమె కితాబిచ్చారు. జస్ట్ వాసన చూసి పులుసులో ఉప్పు సరిపోయిందా? లేదా? చెప్పేయగలరని అన్నారు. ఒక మంచి ఎక్స్ పర్ట్ అని చెప్పారు.

Krishnamraju
Tollywood
Chepala Pulusu

More Telugu News