నాకు కొంచెం సిగ్గు ఎక్కువ!: హీరోయిన్‌ అనుష్క

29-08-2020 Sat 12:04
  • నేను కొత్త వారితో అంత తేలికగా కలవలేను
  • సినిమాలు తప్ప వేరే విషయాల గురించి పట్టించుకోను
  • ఈ కారణాల వల్లే ట్విట్టర్‌కు దూరంగా ఉన్నాను
  • సామాజిక మాధ్యమాల గురించి అవగాహన లేదు
anushka about her entry on social media

హీరోయిన్లు అందరూ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటూ తమ సినిమాలు, జీవిత విశేషాలపై అప్‌డేట్లు ఇస్తూ తమ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తుంటారు. అయితే, అనుష్క శెట్టి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆమెకు ట్విట్టర్‌ ఖాతానే లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరచినప్పటికీ అప్పుడప్పుడు మాత్రమే ఆమె పోస్ట్ చేస్తోంది.

దీనిపై అనుష్క శెట్టి తాజాగా వివరణ ఇచ్చింది. తనకు కొంచెం సిగ్గెక్కువ అని, తాను కొత్త వారితో అంత తేలికగా కలవలేనని చెప్పింది. తాను సినిమాలు తప్ప వేరే విషయాల గురించి అంతగా పట్టించుకోనని చెప్పింది. ఈ కారణాల వల్లే తాను ట్విట్టర్‌కు దూరంగా ఉన్నానని వివరించింది. ట్విట్టర్‌ ఖాతా ఓపెన్ చేయాలని తనను చాలా మంది అడుగుతున్నారని ఆ అమ్మడు తెలిపింది. తనకు అసలు సామాజిక మాధ్యమాల గురించి అంతగా అవగాహన కూడా లేదని చెప్పింది. అయితే, భవిష్యత్తులో తాను ట్విట్టర్‌ ఖాతా ఓపెన్ చేసే అవకాశాలు లేకపోలేదని పేర్కొంది.