China: లిఫ్టులో వృద్ధురాలికి గుండెపోటు.. కాపాడిన యువతి... వీడియో వైరల్

Surveillance camera captured the touching moment when a young mom
  • వాయవ్య చైనాలోని జున్యాంగ్ కౌంటీలో ఘటన 
  • లిఫ్టులో గుండెపోటుతో పడిపోయిన వృద్ధురాలు
  • వెంటనే ప్రథమ చికిత్స చేసి కాపాడిన యువతి
అపార్టుమెంటులోని లిఫ్టులో ఓ వృద్ధురాలు గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఆ లిఫ్టులో ఆమె ఒక్కతే ఉంది. కాసేపటికి లిఫ్టు తెరుచుకున్నాక బయటి నుంచి లిఫ్టులోకి వచ్చిన ఓ యువతి ఆ వృద్ధురాలిని చూసింది. అంతే, ఆమెను కాపాడడమే లక్ష్యంగా ఆ యువతి తన పసిబిడ్డను లిఫ్టు బయట పడుకోబెట్టి వచ్చి, వెంటనే వృద్ధురాలికి సీపీఆర్ (బాధిత వ్యక్తి గుండెలపై చేతులతో అదుముతూ గుండెను పనిచేయించడం) చేయడం మొదలుపెట్టింది.

తన పసిబిడ్డ లిఫ్టు బయట ఏడుస్తున్నప్పటికీ వృద్ధురాలిని బతికించేందుకు ఆమె ఆరాట పడి, చివరకు ఆమె ప్రాణాలను కాపాడింది. ఆ సమయంలో ఆ వృద్ధురాలిని కాపాడడమే తనకు ముఖ్యంగా అనిపించిందని ఆ యువతి చెప్పింది. ఈ ఘటన వాయవ్య చైనాలోని జున్యాంగ్ కౌంటీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ యువతిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
China
Viral Videos

More Telugu News