KTR: వ్యవసాయంలో తెలంగాణ నూతన రికార్డులు!: కేటీఆర్‌

  • సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
  • ఒకనాడు సాగునీరు లేక నెర్రెలు బారిన తెలంగాణ నేల
  • నేడు రైతుబంధు కేసీఆర్ గారి నేతృత్వంలో అధికసాగు
  • రైతన్న కళ్లలో మురిపెం కనపడుతోంది
telangana records in agriculture

తెలంగాణలో సాగునీటి లభ్యత పెరగడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోందని, గత ఏడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే ఈ సీజన్‌లో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందని దిన పత్రికల్లో వచ్చిన వార్తలను తెలంగాణ మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు.

సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదికలో వచ్చిన వివరాలు అందులో ఉన్నాయి. ఈ సీజన్‌లో 126.179 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపినట్లు అందులో పేర్కొన్నారు.

'ఒకనాడు సాగునీరు లేక నెర్రెలు బారిన ఈ నేల నేడు రైతుబంధు కేసీఆర్ గారి నేతృత్వంలో నదీ జలాలు పారగా వ్యవసాయంలో నూతన రికార్డులు సృష్టిస్తోంది. ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంటే, రైతన్న కళ్లలో మురిపెం కనపడుతోంది' అని కేటీఆర్ ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

More Telugu News