Virat Kohli: అనుష్కకు ఐదో నెల... జనవరిలో ముగ్గురం అవబోతున్నామని శుభవార్త చెప్పిన కోహ్లీ!

Kohli Confirms Anushka is Pregnent and Delivary in January
  • నెరవేరనున్న విరుష్క దంపతుల కల
  • జనవరి 2021లో డెలివరీ
  • ట్విట్టర్ లో స్వయంగా వెల్లడించిన కోహ్లీ
విరాట్ కోహ్లీ, అనుష్క దంపతుల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఇండియాలో టాప్ మోస్ట్ సెలబ్రిటీ కపుల్స్ లో ఒకటైన ఈ జంట, జనవరిలో తమ ఇంటికి మూడో మనిషిని ఆహ్వానించనుంది. ఈ విషయాన్ని విరాట్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, అభిమానులకు శుభవార్త చెప్పారు.

"ఇప్పుడిక మేము ముగ్గురం... జనవరి 2021లో రాక" అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు అనుష్కతో ఉన్న ఫోటోను విరాట్ జతచేశారు. ఇందులో అనుష్క బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. వేలాది లైక్స్ వచ్చాయి. ఎంతో మంది ఫ్యాన్స్, సెలబ్రిటీలు విరుష్క దంపతులకు శుభాభినందనలు చెబుతున్నారు. జనవరిలో డెలివరీ ఉన్నదంటే, ఇప్పుడు ఐదో నెల జరుగుతున్నట్టని, ముందే ఎందుకు చెప్పలేదని ఆప్యాయంగా ప్రశ్నిస్తూ, బిడ్డ ఎమోజీలతో హోరెత్తిస్తున్నారు. 
Virat Kohli
Anushka
Pregnent

More Telugu News