TikTok: టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా!

Tiktok CEO Kevin Mayer Resins
  • డిస్నీలో కెరీర్ ను ప్రారంభించిన కెవిన్
  • ఇకపై తాత్కాలిక సీఈఓగా వనీసా పప్పాస్
  • రాజీనామాను ధ్రువీకరించిన సంస్థ
టిక్ టాక్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న కెవిన్ మేయర్, తన పదవికి రాజీనామా చేశారు. సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, ఓ ప్రకటన విడుదల చేసింది. డిస్నీలో తన కెరీర్ ను ప్రారంభించి, విజయవంతమై, ఆపై టిక్ టాక్ లో చేరి, సంస్థ ఉన్నతికి ఆయన ఎంతో తోడ్పడ్డారని ఈ సందర్భంగా టిక్ టాక్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న వనీసా పప్పాస్ తాత్కాలిక సీఈఓగా పనిచేస్తారని సంస్థ పేర్కొంది.

కాగా, అమెరికా ప్రభుత్వంపై టిక్ టాక్ తో పాటు సంస్థ ఉద్యోగి దావా వేసిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం. చైనాకు చెందిన బైట్ డ్యాన్స్, టిక్ టాక్ కు మాతృసంస్థన్న సంగతి తెలిసిందే. చైనాకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్, టిక్ టాక్ అమెరికా వ్యాపారాన్ని విక్రయించుకోవాలని ఆదేశిస్తూ,  అందుకు గడువు పెట్టగా, ఇది సరైన నిర్ణయం కాదంటూ, కోర్టులో కేసు దాఖలైంది.
TikTok
CEO
Resign
Kevin Mayer

More Telugu News