Rahul Gandhi: కొన్ని నెలలుగా నేను చేసిన హెచ్చరికలను ఇప్పుడు ఆర్బీఐ నిర్ధారించింది: రాహుల్ గాంధీ

RBI Has Confirmed What I Have Been Warning For Months says Rahul Gandhi
  • దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న ఆర్బీఐ
  • పేదలకు డబ్బు ఇవ్వాలన్న రాహుల్
  • వినియోగ సామర్థ్యాన్ని పెంచాలని సూచన
మీడియాను ఉపయోగించుకుని సమస్యల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడం వల్ల పేదలకు ఒరిగేది ఏమీ లేదని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఈ ఉదయం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దేశ ఆర్థిక స్థితిపై భారీగానే ఉంటుందని ఆర్బీఐ తాజాగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాహుల్ మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా ఇదే విషయంపై తాను హెచ్చరిస్తున్నానని... తన వ్యాఖ్యలను ఇప్పుడు ఆర్బీఐ నిర్ధారించిందని చెప్పారు.

ఆర్థికి పరిస్థితిని మెరుగుపరచాలంటే... ప్రభుత్వం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఎక్కువ అప్పులు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. పేదలకు డబ్బు ఇవ్వాలని, పారిశ్రామికవేత్తలకు ఎక్కువ పన్నులు విధించరాదని సూచించారు. వినియోగాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పారు. మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోవని అన్నారు.
Rahul Gandhi
Congress
RBI
Economy

More Telugu News