Ram Charan: రామ్ చరణ్ చేయాలనుకుంటున్న డ్రీమ్ ప్రాజక్ట్!

Ram Charan interested in his dream project
  • తన డ్రీమ్ ప్రాజక్ట్ గురించి చెప్పిన చరణ్ 
  • స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమా
  • గతంలో ఆగిపోయిన 'మెరుపు' అలాంటిదే
  • స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానన్న మెగా హీరో  
తాము ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ, ప్రతి ఒక్కరికీ డ్రీమ్ ప్రాజక్ట్ అంటూ ఒకటి వుంటుంది. ఫలానా పాత్ర పోషించాలని, ఫలానా బ్యాక్ డ్రాప్ లో ఎప్పటికైనా సినిమా చేయాలని ప్రతి హీరో, ప్రతి హీరోయిన్ కోరుకుంటూ వుంటారు. ఆ కల కొందరికి త్వరగా నెరవేరితే, కొందరికి ఆలస్యంగా నెరవేరుతూ వుంటుంది. ఇక ఇలాంటి డ్రీమ్ ప్రాజక్టు మెగా హీరో రామ్ చరణ్ కు కూడా ఒకటి వుందట. దాని గురించి తాజాగా వెల్లడించాడు.

'స్పోర్ట్స్ డ్రామా ఒకటి చేయాలన్నది నా చిరకాల కోరిక. వాస్తవానికి గతంలో ఆర్బీ చౌదరి గారి బ్యానర్లో ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో 'మెరుపు' అనే సినిమాను స్టార్ట్ చేశాం కూడా. కానీ, కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదు, ఆగిపోయింది. అప్పటి నుంచీ కూడా స్పోర్ట్స్ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగే ఒక కథ కోసం చూస్తున్నాను. అయితే, ఇంతవరకు నన్ను టెంప్ట్ చేసే స్క్రిప్ట్ మాత్రం దొరకలేదు. వస్తే కనుక కచ్చితంగా చేస్తాను' అని చెప్పాడు చరణ్.

కాగా, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని పూర్తిచేస్తున్న చరణ్ ఈ లాక్ డౌన్ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కొత్త కథలు కూడా విన్నాడు. వాటిలో కొన్నిటికి ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తోంది.  
Ram Charan
Dream Project
RRR

More Telugu News