Supreme Court: ఏపీ ప్రభుత్వ పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

supreme court rejects a pitition on ap capital
  • పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు స్టేటస్‌ కో 
  • కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు
  • హైకోర్టులో విచారణలో ఉన్నందున జోక్యం చేసుకోలేమన్న సుప్రీం
ఆంధ్రప్రదేశ్‌లో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వైసీపీ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, వాటిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ పిటిషన్లను పరిశీలించిన జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం..  ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల వ్యవహారంపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో తమ వద్దకు ఇందుకు సంబంధించిన పిటిషన్‌తో రావడం సరికాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసును ఏపీ హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని తాము భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. 
Supreme Court
Amaravati
YSRCP
AP High Court

More Telugu News