Devineni Uma: మీ అస్మదీయ సంస్థపై, సహకరించిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు‌ జగన్?: దేవినేని ఉమ

devineni fires on ycp
  • భూములను ఆక్రమించుకున్న హెటిరో
  • చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న జిల్లా అధికారి
  • అధికారులలో వణుకు
  • కంటిచూపుతో శాసిస్తున్న వ్యక్తి ఎవరు?
విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటైన ఓ బల్క్‌ డ్రగ్‌ కంపెనీ భూ దందాలకు పాల్పడుతోందని, ఆ కంపెనీ వెనుక ఉన్న పెద్దలు ఎవరని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. విశాఖలో 108 ఎకరాలను ఆ ఫార్మా కంపెనీ ఆక్రమించిందంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన నిన్న పోస్ట్ చేశారు. తాజాగా, ఏబీఎన్ న్యూస్‌ ఛానెల్‌లో వచ్చిన ఓ కథనాన్ని ఆయన పోస్ట్ చేస్తూ ఇదే విషయంపై ఏపీ సర్కారుని ప్రశ్నించారు.

'భూములను ఆక్రమించుకున్న హెటిరోపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న జిల్లా అధికారి. 18 లక్షలకే కేటాయించాలని ఫైలు అమరావతి నుండి కదలడంతో అధికారులలో వణుకు. కొవిడ్ లోనూ గ్రామసభల తీర్మానాలు. కంటిచూపుతో శాసిస్తున్న వ్యక్తి ఎవరు? మీ అస్మదీయ సంస్థపై, సహకరించిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు వైఎస్‌ జగన్' అని దేవినేని ఉమా మహేశ్వరరావు నిలదీశారు.
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP

More Telugu News