Corona Virus: దేశంలో 32 లక్షలు దాటిన కరోనా కేసులు

COVID19 case tally crosses 32 lakh mark
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 32 లక్షల మార్కును దాటింది. గత 24 గంటల్లో 67,151 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,059 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 32,34,475 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 59,449కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 24,67,759 మంది కోలుకున్నారు. 7,07,267 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
                                                                                      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 3,76,51,512 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే  8,23,992 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News