Prabhas: ప్రభాస్ 'ఆదిపురుష్'లో బాలీవుడ్ భామ?

Kiara Advani considered for Adipurush movie
  • ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'
  • సీతాదేవి పాత్రకు కియరా అద్వానీ?
  • వచ్చే జనవరి నుంచి షూటింగ్ మొదలు
  • వీఎఫ్ఎక్స్ పనులకు ఎక్కువ సమయం  
ప్రభాస్ నటించే పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' ఇంకా సెట్స్ కి వెళ్లకముందే సంచలనం రేపుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రామాయణం ఆధారంగా సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో ఇది రూపొందుతుందని వార్తలు వస్తున్నాయి.

ఇందులో ప్రభాస్ శ్రీరాముడి పాత్రను పోషించనున్నాడు. ఆయన సరసన సీతాదేవి పాత్రకు గాను కీర్తి సురేశ్ పేరును పరిశీలిస్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ లేదని ఆ తర్వాత తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్ పాత్రకు బాలీవుడ్ భామ కియరా అద్వానీ కోసం ఈ చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు, ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎంపిక దాదాపు పూర్తయిందని కూడా కొందరు అంటున్నారు.

ఇదిలావుంచితే, ఈ చిత్రం షూటింగును వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించి ఏకధాటిగా రెండు నెలల చిత్రీకరణతో పూర్తి చేస్తామని దర్శకుడు ఓం రౌత్ చెప్పారు. అయితే, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని, ఇందులో వాటి ప్రాధాన్యత ఎక్కువని ఆయన తెలిపారు. కాగా, ఇందులో విలన్ పాత్రను బాలీవుడ్ నటుడు సయీఫ్ అలీ ఖాన్ పోషిస్తాడని ప్రచారం జరుగుతోంది.  
Prabhas
Adipurush
Kiara Advani
Om Routh

More Telugu News