Bigg Boss: బిగ్ బాస్ షో ఆపాలంటూ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు

  • త్వరలో బిగ్ బాస్ నాలుగో సీజన్
  • ప్రజా సంఘాల నేతల అసంతృప్తి
  • గతంలోనూ 'బిగ్ బాస్' పై ఫిర్యాదులు
Complaint filed in Telangana Human Rights Commission against Bigg Boss show

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనూ బిగ్ బాస్ రియాలిటీ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఓ వైపు నిర్వాహకులు సన్నాహాలు చేస్తుంటే, మరోవైపు ఆ షో ఆపాలంటూ కొందరు మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్-4ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ ముక్తల, తల్లిదండ్రుల సంఘం నేత గడ్డం మురళి, తెలంగాణ విద్యార్థి జేఏసీ నేత అమన్ గల్ రాజు ఫిర్యాదు చేశారు.

బిగ్ బాస్ షోపై ఫిర్యాదులు ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అనేక పర్యాయాలు ఫిర్యాదులు వచ్చినా, బిగ్ బాస్ షోకు మాత్రం ఎలాంటి అడ్డంకి ఏర్పడలేదు. మరి ఈసారి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి! కాగా, ఆగస్టు 30న బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రసారం అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

More Telugu News