Devineni Avinash: కొడాలి నాని వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి: దేవినేని ఉమ

 Kodali Nanis comments are arrogant says Devineni Uma
  • రమేశ్ ఆసుపత్రి అంశంలో హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంపపెట్టు
  • హైకోర్టు ప్రశ్నలకు ఏం సమాధానాలు చెపుతారు?
  • నవీన్ హత్యకు ఇసుక మాఫియానే కారణం
రమేశ్ ఆసుపత్రి అంశానికి సంబంధించిన విచారణలో ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్ఓల ప్రమేయం గురించి హైకోర్టు ప్రశ్నించిందని... వీటికి ఏం సమాధానాలు చెపుతారని అన్నారు. డాక్టర్ రమేశ్ కుటుంబాన్ని, బంధువులను, వైద్యులను విచారణ పేరుతో వేధించారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అహంకారంతో చేసినవని అన్నారు.

కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... కరోనా కోసం చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విలేకరి నవీన్ హత్యకు నందిగామ ఇసుక మాఫియానే కారణమని ఆరోపించారు. ఈ హత్య వెనుక ఎమ్మెల్యేతో పాటు జిల్లా స్థాయి అధికారి ప్రమేయం ఉందని అన్నారు.
Devineni Avinash
Chandrababu
Telugudesam
Kodali Nani
YSRCP
Swarna Palace Hotel
Ramesh Hospitals
AP High Court

More Telugu News