Subramanian Swamy: విషం ఆనవాళ్లు తెలియకూడదనే సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం ఆలస్యమయ్యేలా చేశారు: సుబ్రహ్మణ్యస్వామి

  • సుశాంత్ ది హత్యేనంటున్న స్వామి
  • విషప్రయోగం జరిగిందంటూ తాజా ట్వీట్
  • హంతకులను కఠినంగా శిక్షించాలని వ్యాఖ్యలు
Subramanian Swamy made severe allegations on Sushant Singh Rajput issue

సంచలన ఆరోపణలకు మారుపేరైన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై దృష్టిసారించారు. సుశాంత్ ది హత్య అంటూ ఆరోపిస్తున్న సుబ్రహ్యణ్యస్వామి తాజాగా, సుశాంత్ పై విషప్రయోగం జరిగిందని, ఆ విషం ఆనవాళ్లు సుశాంత్ జీర్ణాశయంలో కనిపించకూడదన్న ఉద్దేశంతో కావాలనే పోస్టుమార్టం ప్రక్రియను ఆలస్యం చేశారని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించారు.

"హంతకుల దుష్టస్వభావం, వాళ్ల ఉద్దేశం క్రమేపీ బహిర్గతమవుతోంది. సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియను కావాలనే ఆలస్యం చేశారు. సుశాంత్ కడుపులోని విషం జీర్ణ రసాల్లో కలిసిపోతే, అప్పుడు ఆ విషం ఆనవాళ్లు ఎవరూ గుర్తించలేరన్న ఆలోచనతోనే పోస్టుమార్టం ఆలస్యం అయ్యేలా చేశారు" అంటూ వివరించారు. దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాల్సిన సమయం వచ్చిందని సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు.

More Telugu News