Amy Modi: నీరవ్ మోదీ భార్య అమీ మోదీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన ఇంటర్ పోల్

Interpol issues red corner notice against Amy Modi
  • పీఎన్ బీ బ్యాంకుకు టోకరా వేసి పారిపోయిన నీరవ్ మోదీ
  • నీరవ్ భార్య అమీపైనా ఈడీ, సీబీఐ కేసులు
  • ఇరువురిపై మనీ లాండరింగ్ ఆరోపణలు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్ బీ)కు వేల కోట్ల రూపాయల మేర టోకరా వేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, నీరవ్ మోదీ భార్య అమీ మోదీపై తాజాగా ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. నీరవ్ మోదీపైనా, ఆయన భార్య అమీపైనా భారత్ లో మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ కేసులు నమోదు చేసింది. వారిపై సీబీఐ కేసులు కూడా ఉన్నాయి. ఈడీ, సీబీఐ కేసులున్న నేపథ్యంలో అమీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఆమె ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేయవచ్చు.
Amy Modi
Red Corner Notice
Interpol
PNB Scam
London
UK
India

More Telugu News