Arvind Kejriwal: రండి, మాతో కలిసి ఉద్యమంలో పాల్గొనండి: అన్నా హజారేకు ఢిల్లీ బీజేపీ చీఫ్ లేఖ

Delhi BJP asks Anna Hazare to join its mass movement against AAP govt
  • కేజ్రీవాల్ ప్రభుత్వ విధానాల వల్లే ఢిల్లీలో అల్లర్లు
  • కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాక అవినీతి పెరిగింది
  • ఉద్యమంలో మాతో కలిసి గళమెత్తండి
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించనున్న సామూహిక ఉద్యమంలో పాల్గొనాలని కోరుతూ ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారేకు ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా లేఖ రాశారు. కేజ్రీవాల్ ప్రభుత్వ విధానాల వల్లే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని, రాజకీయ స్వచ్ఛత పేరుతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను దెబ్బతీస్తోందని హజారేకు రాసిన లేఖలో ఆదేశ్ గుప్తా ఆరోపించారు.

కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, అల్లర్ల కారణంగా ఢిల్లీ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఆప్ ప్రభుత్వ విధానాలు, అక్రమాలకు వ్యతిరేకంగా చేపట్టనున్న ఉద్యమంలో పాల్గొనాలని హజారేను ఆహ్వానించారు. ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాలని ఆదేశ్ గుప్తా కోరారు.
Arvind Kejriwal
New Delhi
AAP
BJP
Adesh Gupta
Anna Hazare

More Telugu News