America: అమెరికాలో తెలుగు విద్యార్థులు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Fire accident in Americas Georgia Telugu students are safe
  • జార్జియాలోని లిండ్‌బర్గ్‌లో రెండు రోజుల క్రితం ఘటన
  • ప్రమాదం నుంచి తప్పించుకున్న 20 మంది విద్యార్థులు
  • పాస్‌పోర్టులు, దుస్తులు సహా విలువైన పత్రాలు అగ్నికి ఆహుతి
అమెరికాలో తెలుగు విద్యార్థులు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జార్జియాలోని లిండ్‌బర్గ్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో 80 ఫ్లాట్లు కాలిబూడిదయ్యాయి.

ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 20 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా జార్జియా స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. అగ్ని ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయటపడినట్టు అట్లాంటాలో ఉంటున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్య సమన్వయకర్త డాక్టర్ కుమార్ అన్నవరపు తెలిపారు. అయితే, వారి దుస్తులు, పుస్తకాలు, పాస్‌పోర్టులు, ఇతర ముఖ్యమైన పత్రాలు అగ్నికి ఆహుతైనట్టు పేర్కొన్నారు.  
America
Georgia
Fire Accident
Telugu Students

More Telugu News