Corona Virus: దేశంలో 31 లక్షలు దాటిన కరోనా కేసులు

61408 cases in India in 24 hours
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 61,408 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 836 మంది మృతి చెందారని, 57,468 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,06,349 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 57,542కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 23,38,036 మంది కోలుకున్నారు.
                                     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 3,59,02,137 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే  6,09,917 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News