Kishan Reddy: ఇది తెలంగాణ, ఏపీ సీఎంలు పరిష్కరించుకోవాల్సిన అంశం: కిషన్ రెడ్డి

Kishan Reddy comments on water disputes betweeb AP and Telangana
  • తెలుగు రాష్ట్రాల వివాదంపై కిషన్ రెడ్డి స్పందన
  • జగన్ తో కేసీఆర్ కు రహస్య ఒప్పందం ఉందన్న కిషన్ రెడ్డి
  • కేంద్రంపై కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని హితవు
తెలంగాణ, ఏపీ మధ్య జలవివాదాలు ఉత్పన్నమైన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. "తన మిత్రుడు జగన్ తో కేసీఆర్ కు రహస్య ఒప్పందం ఉంది.  ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన జలవివాదాలను రెండు రాష్ట్రాల సీఎంలే పరిష్కరించుకోవాలి. నీటి కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు" అంటూ హితవు పలికారు.

అంతేకాకుండా, గవర్నర్ తమిళిసై అంశంపైనా స్పందించారు. ఇటీవల ఆమె తెలంగాణ ప్రభుత్వంపై చేసినవి విమర్శలు కావని, ఆమె ఓ వైద్యురాలు కావడంతో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలతో కేంద్రానికి కానీ, బీజేపీ కానీ సంబంధం లేదని అన్నారు.
Kishan Reddy
Andhra Pradesh
Telangana
KCR
Jagan
Tamilisai Soundararajan
Governor

More Telugu News