Balakrishna: హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి రూ.55 లక్షల విలువైన కొవిడ్ సరంజామా అందించనున్న బాలకృష్ణ

Balakrishna will be donating covid care equipment to Hindupur government hospital
  • బాలయ్య దాతృత్వం
  • పీపీఈ కిట్లు, ఔషధాలు అందించాలని నిర్ణయం
  • బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ
టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే కరోనా నేపథ్యంలో ఛారిటీ కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్ సెంటర్ కు భారీగా వస్తు సరంజామా అందించాలని నిర్ణయించారు. సుమారు రూ.55 లక్షల విలువైన మందులు, పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర వైద్య పరికరాలను బాలయ్య ప్రభుత్వ ఆసుపత్రికి అందించాలనుకుంటున్నారు. బాలయ్య ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
Balakrishna
COVID-19
Donation
Equipment
Government Hospital
Hindupur

More Telugu News