Virender Sehwag: కొల్హాపూర్ లో కొట్టుకున్న ధోనీ, రోహిత్ ఫ్యాన్స్... మీరింత పిచ్చివాళ్లేంట్రా! అంటూ సెహ్వాగ్ కామెంట్స్

Sehwag responds on clashes between Dhoni and Rohit Sharma fans
  • కొల్హాపూర్ లో క్రికెటర్ల ఫ్యాన్స్ మధ్య ఘర్షణలు
  • చెరుకుపొలంలోకి తీసుకెళ్లి ఓ వ్యక్తిపై దాడి
  • తీవ్రంగా ఖండించిన సెహ్వాగ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కురుంద్వాడ్ పట్టణంలో ధోనీ, రోహిత్ శర్మ అభిమానులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన తెరపైకి వచ్చింది. వారిలో ఒకరిని ప్రత్యర్థులు చెరుకు పొలంలోకి తీసుకెళ్లి అతడిపై దాడి చేశారు. దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా స్పందించాడు.

"పిచ్చోళ్లలారా... ఏంచేస్తున్నారు మీరు? క్రికెటర్లు బాగానే ఉంటారు, మధ్యలో మీరెందుకు కొట్టుకుంటారు? క్రికెటర్లు ఒకరిని మరొకరు అభిమానిస్తుంటారు. లేకపోతే ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం పిచ్చి ముదిరినట్టు కొట్టుకుంటున్నారు. ఇలాంటి కొట్లాటలు వద్దు. టీమిండియా ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటుంది" అంటూ సెహ్వాగ్ ట్విట్టర్ లో హితవు పలికారు.
Virender Sehwag
MS Dhoni
Rohit Sharma
Fans
Clashes
Kolhapur
Team India

More Telugu News