Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు పంపిన కానుక ఇదిగో!

Mohan Babu gifted Chiranjeevi with a wooden bike on his birthday
  • నిన్న చిరు బర్త్ డే
  • 65వ పుట్టినరోజు జరుపుకున్న మెగాస్టార్
  • ఓ కళాకృతిని పంపిన మోహన్ బాబు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నిన్న తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షల జడివానలో తడిసి ముద్దయ్యారు. తన జన్మదినం నాడు విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికీ చిరంజీవి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అయితే, నటుడు మోహన్ బాబు తన మిత్రుడు చిరంజీవికి బర్త్ డే గిఫ్ట్ పంపిన విషయం ఇవాళ వెల్లడైంది. చిరంజీవి, మోహన్ బాబు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో చిరంజీవి తనకు మోహన్ బాబు ఇచ్చిన కానుకను ట్విట్టర్ లో ప్రదర్శించారు. అది చెక్కతో చేసిన హార్లే డేవిడ్సన్ బైక్ నమూనా. దీనిపై మెగాస్టార్ హర్షం వ్యక్తం చేశారు. "నా చిరకాల మిత్రుడు తొలిసారిగా నా పుట్టినరోజు నాడు ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి... థాంక్యూ మోహన్ బాబు" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Chiranjeevi
Mohan Babu
Gift
Wooden Bike
Birthday
Harley Davidson
Replica
Tollywood

More Telugu News