Face mask: కరోనాకు చెక్ పెట్టేందుకు ఎవరెవరు మాస్క్ ధరించాలంటే?: మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • 12 ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే
  • ఐదేళ్ల లోపు వారు మాస్క్ ధరించడం తప్పనిసరి కాదు
  • ఆడుకునే సమయంలో మాస్క్ తప్పనిసరి కాదు
WHO Issue new guidelines on wearing face masks

కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క మందు మాస్క్ ధరించడం. ముఖానికి మాస్క్ ధరించడం ద్వారా ఈ వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంలో పిల్లలు, పెద్దలు అందరూ మాస్కులు ధరిస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. మాస్కుల విషయంలో తాజాగా సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు పెద్దలకు మాదిరిగానే కరోనా వచ్చే అవకాశాలు ఉండడంతో వారు పెద్దలు ధరించినట్టుగానే మాస్కులు ధరించాలని పేర్కొంది. ఐదేళ్లలోపు పిల్లలు మాత్రం మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని, వీరికి కరోనా సోకే ప్రమాదం తక్కువని పేర్కొంది. 6 నుంచి 11 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు మాత్రం రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం తప్పనిసరిగా మాస్క్ ధరించాలని వివరించింది. పిల్లలు ఆడుకునే సమయంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, ఆ సమయంలో భౌతిక దూరం పాటించడం తప్పనిసరని స్పష్టం చేసింది.

More Telugu News