Sangareddy District: సంగారెడ్డి జిల్లా దోమడుగులోని రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

Fire accident at Chemical Factory in Sangareddy dist
  • దోమడుగులోని రసాయన పరిశ్రమలో ఘటన
  • భీకరంగా ఎగసిపడుతున్న మంటలు
  • మంటలను అదుపులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులోని ఓ రసాయన పరిశ్రమలో అర్ధ రాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు క్షణక్షణానికి ఎగసిపడి పరిశ్రమ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల, అన్నారం ఎయిర్‌ఫోర్స్ అకాడమీ నుంచి ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాక శకటాలు భీకరంగా ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Sangareddy District
Gummadidala
chemical factory
Fire Accident

More Telugu News