Khairatabad: ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద భజరంగదళ్ సభ్యులు నిరసన!

  • 9 అడుగుల ఎత్తునకే పరిమితమైన గణేశుడు
  • భక్తులను దర్శనాలకు అనుమతించని నిర్వాహకులు
  • ఉత్సవ కమిటీతో భజరంగ దళ్ సభ్యుల వాగ్వాదం
Tenssion near Khairatabad Ganesh

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద భజరంగదళ్ సభ్యులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు మధ్య వాగ్వాదం జరుగగా, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

వివరాల్లోకి వెళితే, ప్రతి ఏటా 60 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఖైరతాబాద్ లో ఈ సంవత్సరం కరోనా కారణంగా విగ్రహం ఎత్తును 9 అడుగులకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. వైరస్ దృష్ట్యా, భక్తులను దర్శనాలకు అనుమతించడం లేదు. ఎవరైనా వస్తే, దూరం నుంచి మాత్రమే చూసి వెళ్లిపోవాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో దర్శనానికి భజరంగదళ్ సభ్యులు పెద్దఎత్తున వచ్చిన వేళ, విగ్రహానికి పరదాను అడ్డుగా పెట్టారు. దీంతో కమిటీ సభ్యుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వారు నిరసనకు దిగారు. ఉత్సవ కమిటీ సభ్యులతో గొడవ పడ్డారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి, ఆందోళనకారులను చెదరగొట్టారు.

More Telugu News