Atchannaidu: హైకోర్టు ఆదేశాలతో అచ్చెన్నాయుడిని ఎన్నారై ఆసుపత్రికి తరలింపు

Police shifts corona infected Atchannaidu to NRI Hospital
  • అచ్చెన్నాయుడికి ఇటీవల కరోనా పాజిటివ్
  • గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో చికిత్స
  • మెరుగైన వైద్యం కోసం ఎన్నారైకి తరలింపు
  • ప్రత్యేక గది కేటాయించాలన్న హైకోర్టు
కరోనా బారినపడిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెనాయుడిని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అచ్చెన్నాయుడిని ఎన్నారై ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను గుంటూరు రమేశ్ ఆసుపత్రి నుంచి మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా, రెండు సార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్న నేపథ్యంలో ఆయన గుంటూరు రమేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో మెరుగైన వైద్యం అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అచ్చెన్నకు ప్రత్యేక గది కేటాయించాలని పేర్కొంది.

Atchannaidu
NRI Hospital
Corona Virus
Positive
ESI Scam

More Telugu News