Nithyananda: సొంత దేశం, సొంత రిజర్వ్ బ్యాంకు... కైలాస దేశాధిపతి నిత్యానంద విలాసం!

Self styled god man Nithyananda releases his own national currency
  • అత్యాచార ఆరోపణలతో దేశం వీడిన నిత్యానంద
  • కరీబియన్ దీవుల్లో ఆవాసం!
  • 'కైలాస' పేరిట సొంత దేశం ఏర్పాటు చేసినట్టు ప్రకటన
అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పత్తా లేకుండా పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నారు. కరీబియన్ దీవుల్లో ఓ దీవిని సొంతం చేసుకుని 'కైలాస' అనే దేశాన్ని ఏర్పాటు చేసిన నిత్యానంద తాజాగా తన దేశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస' నెలకొల్పారు. రిజర్వ్ బ్యాంకు అన్న తర్వాత కరెన్సీ ఉండాలి కదా... దాంతో కైలాస దేశముద్రతో నోట్లు, నాణేలు కూడా విడుదల చేశారు.

నాణేలు బంగారంతో తయారైనవని కైలాస దేశాధిపతి నిత్యానంద సెలవిచ్చారు. ఇక, తమ రిజర్వ్ బ్యాంకు విధివిధానాలను కూడా ఆయన వివరించారు. ఏ దేశానికి చెందిన కరెన్సీ అయినా కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, తమ కైలాస కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని తెలిపారు. ఈ మేరకు అనేక దేశాల బ్యాంకులతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఇందులో ఎంతమాత్రం వాస్తవం ఉందనేది భవిష్యత్తులో తేలనుంది.
Nithyananda
Currency
Reserve Bank
Kailasa
India

More Telugu News