Srisailam: ఇంత దారుణాన్ని ఎన్నడూ చూడలేదు: కన్నీటిపర్యంతమైన టీఎస్ జెన్ కో సీఎండీ

TS Genco CMD gets emotional on Srisailam fire accident
  • శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో 9 మంది దుర్మరణం
  • ఎంతో దుఃఖాన్ని కలిగించిందన్న ప్రభాకర్ రావు
  • వీర మరణం పొందారని వ్యాఖ్య
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో సంభవించిన ఘోర ప్రమాదంలో 9 మంది దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఘటన ఎంతో దుఃఖాన్ని కలిగించిందని చెప్పారు. తన ఇన్నేళ్ల అనుభవంలో ఇలాంటి విషాదకర ఘటనను ఎన్నడూ చూడలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ప్లాంటులో మంటలు ఎగసిపడుతున్నప్పటికీ... ప్రాణాలకు ముప్పు అని తెలిసినా, ప్లాంటును కాపాడుకునేందుకు ఉద్యోగులు సాహసోపేతంగా యత్నించారని కొనియాడారు. జాతి సంపదను కాపాడే ప్రయత్నంలో వీర మరణం పొందారని అన్నారు.
Srisailam
Fire Accident
TS Genco
TS Transco

More Telugu News